CHRISTMAS Special Messege - Telugu

క్రిస్మస్ సందేశాలు:




      ప్రియమైన లివింగ్ మన్నా బైబిల్ లెర్నింగ్స్ శ్రేయోభిలాషులకు మా ప్రత్యేక వందనములు తెలియజేయుచున్నాము. క్రిస్మస్ అనగానే మనకు నూతన బట్టలు, వంటలు ఇవి కనిపిస్తుంటాయి. కాని క్రిస్మస్ నాడు ప్రతి ఒక్కరికి క్రీస్తు ప్రేమ చూపాలి, అదేవిధముగా ప్రతి ఒక్కరిలో క్రీస్తు ప్రేమ కనబడాలి. అప్పుడే అది నిజమైన క్రిస్మస్ పండుగ అవుతుంది. క్రీస్తు ఈ లోకానికి చూపిన ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ ఆ ప్రేమను మన తోటివారికి చూపిద్దాం.

సందేశం కొరకు క్రింద ఉన్న అంశాల పై క్లిక్ చేయగలరు.

















      యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకాన్ని ప్రేమించి దైవమైన యేసయ్య మానవుడై ఈ లోకానికి మన కోసం రిక్తుడై వచ్చాడు. రక్తం చిందించుటకు రిక్తుడై వచ్చిన యేసయ్య రక్షణ అందించిన రక్షకుడు. ఆయన మనలను ప్రేమించి రక్షకునిగా ఈ లోకానికి వచ్చాడు. యేసయ్య జన్మ దినాన ఆయన చూపిన ప్రేమ ఆయన ద్వారా రక్షింపబడిన మనము ఇతరులకు చూపించవలసిన వారమై యున్నాము. దేవుని ప్రేమను క్రియల్లో చూపించి క్రిస్మస్ ఆనందాన్ని ప్రతి ఒక్కరిలో చూడవలసిన సమయం క్రిస్మస్.

        క్రిస్మస్ అనే పదం నందు క్రైస్ట్ అనగా క్రీస్తు, మాస్ అనగా ఆరాధన అనే భావము వస్తుందని మనం చెప్పుకుంటూ ఉంటాము. అయితే క్రిస్మస్ నాడు ఆయన చూపిన ప్రేమను జ్ఞాపకం చేసుకొని ఆయనను ఆరాధించువారు తక్కువై పోయారు. క్రిస్మస్ అనే పండుగకు ప్రథమ స్థానమిచ్చి క్రీస్తును, ఆయన ఇచ్చిన రక్షణను, ఆయన ప్రేమను నిర్లక్ష్యం చేయుచున్నారు.

క్రిస్మస్ నాడు మనం చేయవలసిన ప్రముఖమైన క్రియలు:


      క్రీస్తు ప్రేమను జ్ఞాపకం చేసుకోవడం ఆయన ఇచ్చిన రక్షణను బట్టి ఆయనను ఆరాధించాలి. క్రీస్తు ప్రేమను ఇతరులకు పంచడం. అనగా సువార్త చెప్పడం, అవసరతలో ఉన్న వారిని ఆదుకోవడం, బాధలో ఉన్న వారిని ఆదరించడం.

      ఇవి చేసిన రోజు మనం నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని అనుభవించిన వారమవుతాము. ఈ క్రిస్మస్ సందేశాలు చదివి క్రీస్తును ఆరాధిస్తారని, క్రీస్తు ప్రేమ కలిగి యుంటారని ఆశిద్దాం.