History Of Herod - Christmas Special Message
హేరోదుకు అంత చరిత్రా ఉన్నదా....!
యేసయ్యను రెండు సంవత్సరముల వయస్సు నందే చంపాలని ఆశించిన మూర్ఖుడైన వ్యక్తి హేరోదు. ఈ హేరోదు ఎదోమీయుడు. అనగా ఏశావు వంశమునకు చెందిన వ్యక్తి. యేసయ్య యాకోబు వంశమునుండి వచ్చెను. ఏశావు మొదటి నుండి యాకోబుకు శత్రువే. ఏశావు శరీర సంబంధి. యాకోబు ఆత్మ సంబంధి. మానవుని యొక్క శరీరము ఆత్మతో నిరంతరము పోరాడుచూ ఉంటుంది అని పరిశుద్ధ గ్రంధము చెప్తున్నది. శరీరానుసారమైన మనస్సు (మనిషి) మరణ సంబంది. అత్మానుసారమైన మనిషి నిత్య జీవము గలవాడు. (రోమా 8:5) శరీర సంబంధులు ఎల్లప్పుడు ఆత్మ సంబంధులతో పోరాడుచూ ఉంటారు అని వ్రాయబడి ఉంది. దావీదును చంపాలనే ఉద్దేశ్యముతో సౌలు రాజు తరుముతూ ఉండగా యాజకుడైన అబీమెలెకు వద్దచేరి దావీదు ఆశ్రయము పొందాడు. దావీదు నీతిమంతుడు, యధార్థవంతుడు యెహోవా హృదయానుసారుడు. అంతేకాకుండా గొల్యాతు చేతిలో నుంచి ఇశ్రాయేలీయుల ప్రజలను దేవుని కృప ద్వారా విడిపించిన మంచివాడని అందరికీ తెలుసిన విషయమే. ఇటువంటి మంచివాన్ని దుష్టత్వముతో చూపు కానక చంపాలని సౌలు తరుముచూ ఉన్నప్పుడు ఎదోమీయుడైన దోయేగు (మొదటి సమూయేలు 22:9) సౌలు వద్దకు వచ్చి దావీదు అబీమెలెకు దగ్గర ఉనాడని తెలియచేసి దావీదును సౌలు చంపే ప్రయాత్నానికి ఉత్తరమిచ్చాడు. దావీదు తప్పించుకొని పోగా హాయేగు చెప్పిన దానిని బట్టి సౌలు అచ్చట ఉన్న అన్యం పుణ్యం ఎరుగని ఎనుబది అయిదుగురు యాజకులను కత్తితో హతం చేయించాడు. ఎదోమీయుడు అయిన ఈ దోయేగు యాజకుల మరణమునకు కారకుడయ్యాడు.
ఏశావు యాకోబును చంపాలని ప్రయత్నించెను. అప్పటి నుంచి యాకోబు సంతతివారి మీద ఏశావు యొక్క సంతతి అనగా ఏదోమీయులైన వారు హత్యా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. దావీదు పాత నిబంధనలో అనేక విషయాల్లో క్రీస్తును పోలినవాడు. దావీదు మరణమునుండి తప్పించుకొనగా అన్యం పుణ్యం ఎరుగని యాజకులు ఆత్మానుసారమైన క్రీస్తును శరీరానుసారమైన ఏశావు వంశస్థులు ఎదోమీయుడైన హేరోదు చంప ప్రయత్నించగా యేసయ్య తప్పించబడెను. ఆ రోజున సౌలు రాజు దోయేగు యొక్క ప్రోద్బలము వలన అన్యం పుణ్యం ఎరుగనటువంటి యాజకులను చంపెను. అదేవిధముగా హేరోదు యొక్క అజ్ఞమేరకు రెండు సంవత్సరములలోపు ఉన్న పసి పిల్లలు ఖడ్గం పాలైయ్యారు. హేరోదు సాతానుకు గుర్తుగా ఉన్నాడు. వాడు మొదటి నుండి హంతకుడు అబద్ధికుడు. “యేసయ్యను ఆరాధిస్తాను అన్నవారు చంపబడ్డారు. కొన్నివేల సంవత్సరముల తర్వాత దావీదు వంశములో నుండి ఉదయించిన రక్షకున్ని గూర్చి మీరు వెళ్ళి అతడు ఎక్కడ ఉన్నాడో నాకు తెలియజెప్పుడి అని జ్ఞానులతో అబద్ధమాదాడు. జ్ఞానులు తనను మోసగించారని గ్రహించిన చిన్న పిల్లలను నిర్దాక్షిణ్యముగా చంపించెను. అంతేకాకుండా తన కొడుకులను, తన భార్యను, తన కుటుంబములో అనేక మంది సభ్యులను హతమార్చిన రక్త దాహం కలవాడు.
హేరోదు చేసిన హత్యలు:
- తన భార్యను తనే చంపించాడు.
- తన ముగ్గురు కుమారులను లాభంకోసం హత్య చేసాడు.
- తన అత్తగార్ని కూడా హతమార్చాడు.
- తన బావమరిదిని, చిన్నాన్నను మరెందరినో హతమార్చినవాడు.
- చివరికి యేసు క్రీస్తును కూడా చంపాలనే చెడు బుద్ధితో బెల్లెహేమును దాని సకల ప్రాంతములయందు నివసించు రెండు సంవత్సరముల లోపు వయసు గల చిన్నపిల్లలందరిని పొట్టన పెట్టుకున్నాడు అంటే... మీరే ఆలోచించండి???
