Gospel Of Luke - Bible Quiz
జనవరి 23, 2022
Bible Quiz - Gospel of Luke
లూకా సువార్త పై నిర్వహించబడుతున్న ఈ బైబిల్ క్విజ్ కొరకు ప్రార్థన పూర్వకముగా సిద్ధపడుతున్నారని నమ్ముచున్నాము. ఈ క్విజ్ కొరకు తెలుగు బైబిల్ నందు ఇవ్వబడిన ఫుట్ నోట్ లతో సహా అధ్యయనం చేస్తు సిద్ధపడ్డారని ఆశిస్తున్నాము. లివింగ్ మన్నా టీమ్ ద్వారా నిర్వహింపబడుతున్న ఆన్లైన్ బైబిల్ క్విజ్ ప్రోగ్రాం కొరకు మీరు ప్రార్థన చేయాలని మనవి చేయుచున్నాము. క్విజ్ రాసే సమయంలో ఏ సాంకేతిక సమస్య వచ్చినా లివింగ్ మన్నా బైబిల్ లెర్నింగ్ టీమ్ ను సంప్రదించగలరు. లూకా సువార్త ఈ తెలుగు ఆన్లైన్బైబిల్ క్విజ్ రాయుచున్న మీ అందరికి మరొక సారి శుభాలు చేస్తున్నాము.
యూదుడైన మత్తయి తన సువార్తను ప్రధానంగా యూదుల నిమిత్తము రచింపగా; లూకా గ్రీకు జాతీయుడు అనగా అన్యుడు; కాబట్టి తన సువార్తను అన్యుల కోసం వారు సులభంగా అర్థం చేసుకొని విధంగా రచించాడు. లూకా తన సువార్తను వ్రాయు చున్నప్పుడు మార్కు సువార్త ప్రతి అతని దగ్గర ఉండినది. అని బైబిల్ పండితులు చెప్పడం జరిగింది. కాబట్టి మార్కు రాసినా; అనేక వచనాలను లూకా సువార్తలో మనం గమనించవచ్చు.
యేసు జీవిత చరిత్రను రచించడానికి లూకా ఇతర సమాచారాన్ని కూడా ఉపయోగించాడు అని చెప్పవచ్చు. ఇందులో కొంత మత్తయి సువార్త లో కూడా పొందుపరచబడి ఉన్నది. అయితే కొంత సమాచారం లూకా సువార్త లో మాత్రమే కనిపిస్తుంది.
బైబిల్ క్విజ్ | లూకా సువార్త |
ప్రశ్నల విధానం | బహుళ ఎంపిక |
మొత్తం ప్రశ్నలు | 30 |
మొత్తం మార్కులు | 30 |
సమయం | 20 నిమిషాలు |
అన్నిటికంటే ప్రాముఖ్యంగా లూకా చరిత్రకారుడు అన్న విషయము గుర్తుంచుకోవాలి అతడు తన సువార్త లో అదేవిధంగా అపోస్తలుల కార్యముల గ్రంధములను ఖచ్చితమైన చారిత్రక వివరాలు ఇవ్వడానికి జాగ్రత్త వహించాడు. ఈ సత్యము ఆ కాలపు ఇతర చారిత్రక రచనలను బట్టి గట్టిగా ఋజువయ్యింది. అంతే గాక, వివిధ భూగర్భ పరిశోధనల వలన కూడా ఇది నిరూపించబడింది. క్రొత్త నిబంధన గ్రంథము లో వ్రాయబడిన యేసుక్రీస్తు జీవితం మానవుల ఊహ రచన కాదు. అది సంపూర్ణముగా సత్యమైనది, నమ్మదగినది, చారిత్రకమైనది.
లూకా సువార్త లో మనము క్రింది అంశాలను చూడవచ్చు:
- రక్షకుని గూర్చిన ప్రకటన
- యేసు క్రీస్తు ప్రత్యక్షమగుట
- యేసు క్రీస్తు పరిచర్య
- సిలువకు మార్గము
- యేసు శ్రమలు పొందుట
- యేసుక్రీస్తు పునరుత్ధానము