About Us
Manna Bible Quizzes - Leads To Bible Learning
ఆత్మీయ జీవితానికి, ఆత్మీయ ఎదుగుదలకు ఉపయోగపడే బైబిల్ ను అధ్యయనం చేయుటకు, అనేక మందిని వాక్యం పట్ల ఆకర్షితులయ్యే విధముగా చేయడమే మన్నా బైబిల్ క్విజ్స్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. మన యొక్క బైబిల్ జ్ఞానాన్ని పరీక్షించుకొనుటకు మన్నా బైబిల్ క్విజ్స్ ఒక గొప్ప అవకాశం. మన్నా బైబిల్ క్విజ్స్ దేవుని సహాయం ద్వారా నడుపబడుతున్నది. బైబిల్ క్విజ్స్ ద్వారా పరిశుద్ధ గ్రంథమును అధ్యాయనం చేయుటకు మన్నా బైబిల్ క్విజ్స్ గొప్ప వేదిక.
బైబిల్ ను లోతుగా అర్థం చేసుకోవడానికి బైబిల్ క్విజ్స్ ద్వారా, మన్నా బైబిల్ స్టడీ ద్వారా, మన్నా చిల్డర్న్స్ బైబిల్ క్విజ్స్ ద్వారా, మన్నా బైబిల్ గేమ్స్ ద్వారా ఇంకా ఇంకా అనేక కార్యక్రమాల ద్వారా దేవుని కొరకై ఉపయోగపడుతున్న సాధనమే మన్నా బైబిల్ క్విజ్స్. మొట్టమొదటిసారిగా తెలుగు ఆన్లైన్ బైబిల్ క్విజ్స్ కొరకు రూపొందించిన వేదిక ఈ మన్నా బైబిల్ క్విజ్స్.
మనం నేర్చుకున్న, అధ్యయనం చేసిన బైబిల్ వాక్యాలను గుర్తించుకోవడానికి మన్నా బైబిల్ క్విజ్స్ ఎంతగానో తోడ్పడుతుందని మన్నా బైబిల్ క్విజ్స్ టీమ్ కోరుకుంటుంది. పరిశుద్ధ గ్రంథమును పుస్తకాల వారీగా అధ్యయనం చేయడానికి మన్నా బైబిల్ క్విజ్స్ ఉపయోగపడుతుంది. బైబిల్ లోని అనేక ఆధ్యాత్మిక సత్యాలను తెలుసుకొనుటకు, అపోహలకు లోనుకాకుండా ఉండుటకు మన్నా బైబిల్ క్విజ్స్ ను దేవుడు తన సాధనముగా ఉపయోగించుకుంటున్నారని విశ్వసిస్తున్నాము.
దేవుని సాధనమైన మన్నా బైబిల్ క్విజ్స్ ను మీ అనుదిన ప్రార్థనలో తప్పక జ్ఞాపకము చేసుకొని ప్రార్థించండి. మన్నా బైబిల్ క్విజ్స్ గురించి మీ బంధువులకు, స్నేహితులకు, శ్రేయోభిలాషులకు, సంఘసభ్యులకు పరిచయం తప్పక పరిచయం చేయండి. మన్నా బైబిల్ క్విజ్స్ ను బట్టి దేవునికే మహిమ కలుగును గాక. ఆమెన్!
~ దేవుడు మిమ్మును దీవించును గాక ~
ప్రేమతో,
మన్నా బైబిల్ క్విజ్స్