ROMANS PART 1 Bible Quiz - 1 to 8 Chapters
జనవరి 11, 2022
రోమా పత్రిక మొదటి భాగం బైబిల్ పరీక్షలో పాల్గొంటున్న మీ అందరికి మా యొక్క శుభాలు తెలియజేయుచున్నాము.
రోమా పత్రిక మొదటి భాగం - బైబిల్ క్విజ్
పత్రికలలో ఎక్కువ మంది చదివే పత్రిక రోమా పత్రిక అని చెప్పవచ్చు. ఎందుకంటే రోమా పత్రిక ద్వారా హెచ్చ్చరిపబడవచ్చు, ఆదరించబడవచ్చు, మరిన్ని సత్యాలను గ్రహించవచ్చు అనే ఆలోచనతో రోమా పత్రిక చదవడం అనేక మంది విశ్వాసులు పూర్తి చేసే ఉంటారు. మరి ఈ పత్రిక లోని అధ్యాయములను సగముగా విభజించి రెండు భాగాలుగా క్విజ్ ను నిర్వహించడం జరిగింది.
బైబిల్ క్విజ్స్ యొక్క ముఖ్య ధ్యేయం:
మనం చదివిన లేదా ధ్యానించిన వాక్యఅంశములను తిరిగి నెమరు వేయుటకు, వాటిని గుర్తు తెచ్చుకోవటానికి ఈ యొక్క బైబిల్ క్విజ్స్ ప్రాముఖ్య పాత్ర పోషిస్తాయి అని చెప్పక తప్పదు. బైబిల్ ధ్యానం నందు సమయం వెచ్చించుటకు బైబిల్ క్విజ్స్ అనేకులకు ఆకర్షిస్తుంది. ఇంతటి గొప్ప పాత్ర బైబిల్ పరీక్షలు పోషిస్తాయి. ఇలాంటి బైబిల్ క్విజ్స్ నిర్వహించడానికి దేవుడు మాకు తెరచిన మార్గానికై దేవునిని స్తుతిస్తున్నాము. ఈ క్విజ్స్ నందు పాల్గొంటూ అనేక మందికి పరిచయం చేస్తున్న మీ అందరికి మా ప్రత్యేక వందనాలు.
బైబిల్ క్విజ్స్ ప్రాముఖ్యత గూర్చి మరిన్ని విషయాలను తెలుసుకోవడానికి మా వెబ్సైట్ ను శోధించండి. ఈ క్విజ్స్ మీ యొక్క ఆత్మీయ జీవితానికి మేలుకరముగా ఉన్నాయని మేము నమ్ముచున్నాము. అనేక మంది మాకు తెలియజేసిన వారి సాక్ష్యాలను బట్టి, వారి అనుభవాలను బట్టి దేవున్ని స్తుతించుచున్నాము.
బైబిల్ క్విజ్ వివరాలు
బైబిల్ క్విజ్ | రోమా పత్రిక-1 |
ప్రశ్నల విధానం | బహుళ ఎంపిక |
మొత్తం ప్రశ్నలు | 30 |
మొత్తం మార్కులు | 30 |
సమయం | 20 నిమిషాలు |
మీ అభిప్రాయాలను పంచుకోగలరు:
దేవుని కృపను బట్టి నిర్వహించబడుచున్న ఈ బైబిల్ క్విజ్స్ ద్వారా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను మాతో పంచుకోగలరు. ఈ బైబిల్ పరీక్షలు మీ ఏ విధముగా సహాయపడుతున్నాయో మాకు తెలియజేసి దేవున్ని మహిమపరచుటలో ముఖ్య పాత్ర పోషించిన వారవుతారు.
రోమా పత్రిక రెండవ భాగం బైబిల్ క్విజ్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.