10 Commandments For Christmas
క్రిస్మస్ సందర్భంగా పది ఆజ్ఞలు
క్రిస్మస్ దేవునిని కనుపరచే విధంగా, ఆత్మతో, సత్యముతో ఆయనను ఆరాధించే విధంగా ఉండుటకు ఈ ఆజ్ఞలను పాటిద్దాం. క్రీస్తు చూపెట్టిన ప్రేమను ఇతరులకు చూపెట్టిన వారిగా ఉందాము.
2.క్రిస్మస్ (Christmas) ను క్రీస్తు లేకుండా 'ఒ'X'Mas గా మార్చకూడదు.
3.క్రిస్మసను ఆత్మీయంగా జరుపుకోవాలి గాని ఆచారంగా జరుపుకోకూడదు.
4. తిండికి, త్రాగుళ్ళకు తిరుగుళ్ళకు - క్రిస్మస్ ను ఆసరాగా తీసుకోకూడదు.
5.క్రిస్మస్ నాడు దేవుడు నీ కొరకు క్రీస్తును బహుమానంగా ఇచ్చెను. గనుక నిన్ను, నీ
కుటుంబాన్ని నేటినుండైనా దేవునికి బహుమానంగా అర్పించవలెను.
6. కొత్త బట్టలను ధరించలేకపోయినప్పటికి దిగులుపడకుండా క్రీస్తును ధరించానని సంతోషించవలెను.
7.దేవుని మందిరములో క్రిస్మస్ నాడు దేవుని వాక్యమునకే ప్రాముఖ్యత నివ్వాలికానీ,
పాటలకు, సంగీతానికి, నాటకాలకు కాదు.
8.సమాధానం కొరకు క్రీస్తు ఈ లోకానికి పంపించబడ్డాడు గనుక ఎవరితోనైతే
సమాధానం లేదో వారితో సమాధాన పడాలి.
9.క్రిస్మస్ నాడు క్రీస్తును చూపించడానికే తాపత్రయపడాలికాని మీరు ధరించిన
బట్టలు, బంగారం కాదు. వాటిని ఇతరులతో పోల్చుకోకూడదు.
10.దిక్కులేని వారిని, దరిద్రులను దర్శించి తోటివారికి క్రీస్తు జన్మదిన సందేశాన్ని,
ప్రేమను క్రియాపూర్వకంగా తెలియజేయాలి.
ఈ యొక్క ఆజ్ఞలను పాటించిన ప్రతి ఒక్కరు నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని, క్రీస్తు ప్రేమను అనుభవించిన వారౌతారని మనము గ్రహించాలి.
ప్రేమతో,
మన్నా బైబిల్ క్విజ్స్

