1st TIMOTHY Bible Quiz
జనవరి 11, 2022
మొదటి తిమోతి పత్రిక పై ఉన్న ఈ బైబిల్ క్విజ్ నందు పాల్గొనుచున్న మీకు మా శుభములు తెలిజేస్తున్నాము...!
మొదటి తిమోతి పత్రిక - బైబిల్ క్విజ్
క్రొత్త నిబంధన పుస్తకములలో మనకు అధికముగా కనిపించేవి పత్రికలు. అందులో పౌలు గారు రచించిన పత్రికలు ఎక్కువగా కనిపిస్తాయి. విశ్వాసులను, సంఘాలను పురుకొల్పే పుస్తకాలలో ఈ పత్రికలు ప్రముఖమైనవని చెప్పక తప్పదు. మన ఆధ్యాత్మికతను అభివృద్ధి చేసుకొనుటకు కూడా పత్రికలు ధ్యానించవచ్చు.
ప్రభువు యందు ప్రియమైన దేవుని జనాంగమా...! ఈ బైబిల్ క్విజ్స్ మీ ఆధ్యాత్మికతకు ఉపయోగకరంగా ఉంటున్నాయని మేము మనస్ఫూర్తిగా నమ్ముచున్నాము. ఈ క్విజ్స్ లో పాల్గొంటూ, అనేక మందికి ఈ బైబిల్ క్విజ్స్ గూర్చి తెలియజేసీ మీరు ఈ పరిచర్య పట్ల కనపరుస్తున్న ప్రేమను బట్టి మీకు వందనములు తెలియజేయుచున్నాను. ఈ బైబిల్ క్విజ్స్ నందు పాల్గొనిన మీరు ఇస్తున్న ఫీడ్బ్యాక్ ను బట్టి మేము ఎంతగానో సంతోషించుచున్నాము. మిమ్మును బట్టి దేవునిని స్తుతియించి, మీ కొరకు మా ప్రార్ధించుచున్నాం.
బైబిల్ క్విజ్ వివరములు
| బైబిల్ పరీక్ష | 1 తిమోతి పత్రిక |
| ప్రశ్నల విధానం | బహుళ ఎంపిక |
| మొత్తం ప్రశ్నలు | 30 |
| మొత్తం మార్కులు | 30 |
| సమయం | 20 నిమిషాలు |
పరిచర్యలో పాలిభాగస్థులుకండి:
ప్రభువు యందు ప్రియ స్నేహితులారా...! దేవుని పనిని గూర్చి మీకు తెలిసిన వారికి తెలియజేసి అనేక మందిని ఈ బైబిల్ క్విజ్స్ ద్వారా బైబిల్ పట్ల ఆశక్తిని కలుగజేయండి. ఈ విధంగా మీరు దేవుని పరిచర్య నందు పాలిభాగస్థులు కాగలరని గుర్తు చేయుచున్నాము. మీలో చాలా మంది ఇప్పటికే ఈ పరిచర్యను గూర్చి అనేక మందికి తెలియజేయుట తెలుసుకొని మిమ్మును బట్టి దేవునిని మహిమపరచుచున్నాము. ఈ పరిచర్య పొరుగు దేశాలకు కూడా పరిచయం కాడానికి దేవుడు తెరచిన మార్గానికై దేవ దేవునికి స్తుతులు చెల్లింపవలసినవారమై యున్నాము.
రెండవ తిమోతి పత్రిక బైబిల్ క్విజ్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
