ప్రభవు నందు ప్రియమైన మిత్రులకు! ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు తెలియజేయుచున్నాము. ఈ యూదా పత్రిక బైబిల్ క్విజ్ నందు పాల్గొంటున్న మిమ్మును దేవుడు దీవించును గాక.
యూదా పత్రిక - బైబిల్ క్విజ్
యూదా పత్రిక చిన్నదైనప్పటికి మనం తెలుసుకోవలసిన అనేక బైబిల్ సత్యాలు ఇందులో పొందుపరచబడడం విశేషం. దేవుడిచ్చిన ఒక గొప్ప జ్ఞాన గ్రంధమే బైబిల్. అటువంటి పరిశుద్ధ గ్రంథమును మనం ప్రేమించి దానిని ధ్యానించుట ద్వారా ఈ క్విజ్స్ ను బట్టి దేవునికి సమయమిచ్చుచున్నామని నమ్ముచున్నాము. జ్ఞాన గ్రంథమందు పొందుపరచబడిన సత్యాలను తీగెలుసుకొనుటకు, వాటిని ధ్యానించుటకు దేవుడు మనకిచ్చిన గొప్ప వేదిక ఈ మన్నా బైబిల్ క్విజ్స్ అని దేవునిని స్తుత్తించవలసిన వారమై యున్నాము. మనకు జ్ఞానం కావాలన్న, మనము ధైర్యం పొందాలన్న బైబిల్ మనకు అనుగ్రహిపబడిన ఒక గొప్ప బహుమతివంటిది.
బైబిల్ క్విజ్స్ మానక పాల్గొంటున్న మీ అందరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఈ బైబిల్ పరీక్షలు మీ జీవితానికి, విశ్వాసానికి తోడ్పడుతాయని లివింగ్ మన్నా బైబిల్ లెర్నింగ్స్ టీమ్ ఆశిస్తున్నది. దేవుడిచ్చిన ఆలోచనను బట్టి, ఆయన ఇచ్చిన భారాన్ని బట్టి ఈ బైబిల్ క్విజ్స్ ను నిర్వహించడం జరుగుచున్నది. దేవుడు ఎంత గొప్ప వాడో ఆయన ఈ క్విజ్స్ విషయంలో చేసిన అద్భుతాలను బట్టి దేవున్ని స్తుత్తించుచున్నాము. బైబిల్ క్విజ్స్ నందు పాల్గొనుచున్న మీరందరు ఈ పరిచర్యను బట్టి దేవునికి స్తుతులు చెల్లించి; మీ అనుదిన ప్రార్ధనలలో ఈ బైబిల్ క్విజ్స్ పరిచర్యను జ్ఞాపకం చేసుకొండి.
పరిశుద్ధ గ్రంథము మనకు ధైర్యాన్ని ఇస్తుంది. పరిశుద్ధ గ్రంథము మనలను ఆదరిస్తుంది. పరిశుద్ధ గ్రంథము మనలను ముందుకు నడిపిస్తుంది. పరిశుద్ధ గ్రంథము మనకు సత్యాన్ని బోధపరుస్తుంది. పరిశుద్ధ గ్రంథము మనలను సత్య మార్గమునందు నడిపించుటకు తోడ్పడుతోంది. పరిశుద్ధ గ్రంథము మనం శోధనకు లొంగకుండా దానిని జయించుటకు శక్తినిస్తుంది.
ఇలాంటి దైవ గ్రంథాన్ని ప్రేమించి దేవునికి మీరిస్తున్న సమయమును బట్టి దేవునిని స్తుత్తించుచున్నాము. అనేకులు బైబిల్ పట్ల ఆశక్తి కలిగి బైబిల్ ను పఠించి వాక్యానుసారముగా దేవునిచే హెచ్చరించబడి సత్య మార్గమందు నడుచుకోవాలనేదే మా ప్రార్ధన అయ్యున్నది. అందుకు ఈ బైబిల్ క్విజ్స్ అనేకులకు బైబిల్ పట్ల ఆకర్శితం చేయగలవని నమ్ముచున్నాము.
బైబిల్ క్విజ్ వివరములు
| బైబిల్ పరీక్ష |
యూదా పత్రిక |
| ప్రశ్నల విధానం |
బహుళ ఎంపిక |
| మొత్తం ప్రశ్నలు |
30 |
| మొత్తం మార్కులు |
30 |
| సమయం |
20 నిమిషాలు |
ఈ పరిశుద్ధ గ్రంథ క్విజ్స్ ద్వారా మీరు పొందుచున్న మేలులను, మీరు తెలుసుకుంటున్న కొత్త విషయాలను మాతో పంచుకోనండి. ఈ పేజీ చివర ఉన్న కామెంట్ బాక్స్ ద్వారా లేదా హోమ్ పేజీ నందు గల కాంటాక్ట్ ఫారం ద్వారా మాతో మీ అనుభవాలను పంచుకోగలరు. దాని ద్వారా మేము దేవుని యందు అతిశయించుటకు, దేవునిని ఘనపరచుటకు అవకాశాన్ని ఇచ్చిన వారవుతారు.
ఫిలేమోను బైబిల్ క్విజ్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.