SPIRITUAL INDEPENDENCE - Bible Quiz
Special BIBLE QUIZ
ఆధ్యాత్మిక స్వాతంత్ర్యము - బైబిల్ క్విజ్
ఆధ్యాత్మిక స్వాతంత్ర్యము అనగానే మనకు గుర్తుకు రావసినది; పాపము నుండి అదేవిధంగా శాపము నుంచి, ఈ లోకాశాల నుంచి ముఖ్యంగా పాపపు బానిసత్వం నుండి మనలను ప్రేమతో రక్షించి విడిపించిన, విమోచించిన యేసయ్య గుర్తుకు రావాలి. ఇవాళ మనం జీవించి యున్నామంటే, దానికి కారణం ఆయన మనలను విమోచించియున్నాడు. దేవుని ప్రేమ ఎంత గొప్పదో మనం వర్ణించలేం. అదేవిధముగా దేవుడు మనకిచ్చిన ఈ ఆధ్యాత్మిక స్వాతంత్ర్యము అనగా పాపము నుండి విడుదల, విమోచన విలువను కూడా వర్ణింపలేనివి మిత్రులారా....!
బైబిల్ క్విజ్ వివరాలు
| బైబిల్ క్విజ్ | ఆధ్యాత్మిక స్వాతంత్ర్యము |
| ప్రశ్నల విధానం | బహుళ ఎంపిక |
| మొత్తం ప్రశ్నలు | 20 |
| మొత్తం మార్కులు | 20 |
| సమయం | 20 నిమిషాలు |
బైబిల్ లో ఉన్న స్వాతంత్ర్యమును గూర్చిన విషయములను దృష్టిలో ఉంచుకొని ఈ క్విజ్ ను రూపొందించడం జరిగినది. బైబిల్ క్విజ్ నందు పాల్గొనుచున్న మీ అందరికి లివింగ్ మన్నా బైబిల్ లెర్నింగ్స్ తరపున శుభాభివందనములు. క్విజ్ సభ్యులందరికి మేము చేయు ప్రాముఖ్యమైన మనవి ఏంటంటే... మీరు క్విజ్ కొరకు ప్రార్ధన పూర్వకముగా ప్రిపేర్ కాగలరు. మీరు ప్రార్ధన పూర్వకముగా సిద్ధపడినప్పుడు దేవుడు మీకు కావలసిన మన్నాను తప్పక అనుగ్రహిచు వాడై యున్నాడు. మన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయనకు మనకేది అవసరమో తెలుసు. కానీ అది పొందుకోవడానికి మనం ప్రార్ధన పూర్వకముగా ప్రభు సన్నిధిలో సిద్ధపడాలి.
స్వాతంత్ర్యము పై ప్రత్యేకముగా రూపొందించిన ఇటువంటి బైబిల్ పరీక్ష ద్వారా దేవుడు మనకిచ్చిన స్వాతంత్ర్యమును గ్రహింపవచ్చు. అలాగే స్వాతంత్ర్యము ద్వారా మనం ఏ విధముగా మారామో, అదేవిధముగా పరిశుద్ధ గ్రంధమందు స్వాతంత్ర్యము ఏమి చెప్పబడినదో తెలుసుకుంటారని విశ్వసించుచున్నాము.
నేనెవరిని...? అనే ప్రత్యేక బైబిల్ క్విజ్ నందు పాల్గొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి.
