Living Manna Bible Learning - anniversary special
జనవరి 07, 2022
Bible - Quiz Master's Competition
Competition Details (English) - Click Here!
ప్రైస్ ద లార్డ్ ఆల్. అందరూ ఎలా ఉన్నారు…? మీ అందరికీ మరొక సారి ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తున్నాను. లివింగ్ మన్నా బైబిల్ లెర్నింగ్ టీమ్ వారు నిర్వహిస్తున్న బైబిల్ క్విజస్ మీకు ఆశీర్వాదకరముగా ఉన్నవని నమ్ముచున్నాము. లివింగ్ మన్నా బైబిల్ లెర్నింగ్ టీమ్, ఇప్పుడు, సరి క్రొత్త టాస్క్ తో మీ ముందుకు వచ్చింది. అదే "క్విజ్ మాస్టర్ కాంపిటీషన్". ఈ క్విజ్ మాస్టర్ కాంపిటీషన్ లో మీరు ఇప్పటి వరకు నిర్వహించబడిన తెలుగు బైబిల్ క్విజస్ ను ఇంగ్లీషు భాషలోకి లేదా హిందీ భాషలోకి లేదా తమిళ్ భాషలోకి లేదా మలయాళం భాషలోకి లేదా కన్నడ భాషలోకి అనువాదం చేయాలి. మీకు బాగా తెలిసిన ఏదైనా ఒక భాషలోకి అనువాదం చేయాల్సి ఉంటుంది. ఈ కాంపిటీషన్ నందు తెలుగుతో పాటు ఇంగ్లీష్, లేదా తమిళ్ లేదా హిందీ లేదా మలయాళం కన్నడ భాషలు వ్రాయడం చదవడం వచ్చిన వారు పాల్గొనవచ్చు. పాల్గొన దలచిన వారు ఇతరుల సహాయం కూడా తీసుకోగలరు. ఈ క్విజ్ మాస్టర్ కాంపిటీషన్ కొరకు మీరు, ప్రార్థనా పూర్వకముగా సిద్ధపడవలెనని మనవి చేయుచున్నాము.
ఎలా పాల్గొనాలి...?
- ముందుగా మీరు www.mannabiblequizzes.com అనే మా వెబ్సైట్ ను సందర్సించండి.(హోమ్ పేజీలోకి వెళ్ళాలి)
- మెనూ ఐకాన్ ను క్లిక్ చేయండి. ఆ తర్వాత., కనిపిస్తున్న బైబిల్ క్విజ్ అనే దాని పై క్లిక్ చేసి.., జనరల్ బైబిల్ క్విజ్ ను సెలెక్ట్ చేయండి.
- ఇప్పుడు మీకు గ్రంధాల వారీగా నిర్వహించబడిన బైబిల్ క్విజస్ కనబడతాయి. మీరు ఏ బుక్ ట్రాన్స్ లెట్ చేయాలనుకుంటున్నారో ఆ బుక్ కి సంబంధించిన దాన్ని క్లిక్ చేసి ఆ క్విజ్ లో పాల్గొనండి. మీరు పాల్గొని, సబ్మిట్ బటన్ క్లిక్ చేసి, పేజీని స్క్రోల్ అప్ చేసిన వెంటనే వ్యూ స్కోర్ అనే బటన్ కనిపిస్తుంది. ఆ బటన్ పై క్లిక్ చేసినప్పుడు, మీకు ఆ పుస్తకానికి సంబంధించిన ప్రశ్నలు, జవాబులు, రిఫరెన్స్ లు కనిపిస్తాయి. ఈ రెఫరెన్సులు మీకు బైబిల్ చూసి ట్రాన్స్ లెట్ చేయడానికి ఎంతగానో సహాయపడుతాయు.
- మీకు కనబడుతున్న ఆ ప్రశ్నలను, ఆప్షన్స్ మరియు రెఫరెన్సులతో పాటు అనువాదం చేస్తూ ఒక నోట్స్ లో కానీ., పేపర్ లో కానీ, రాసుకొండి. ఆ విధంగా అన్ని ప్రశ్నలు పూర్తి చేయండి.
- ట్రాన్స్ లేషన్స్ సబ్మిట్ చేయాల్సిన అప్లికేషన్ లింక్ పై క్లిక్ చేయండి. ఈ లింక్ ఈ పేజీ చివరిలో మరియు హోమ్ పేజీ నందు అందుబాటులో ఉంటుంది. అక్కడ మీరు అనువాదం చేసి రాసిపెట్టుకున్న ప్రశ్నలను టైప్ చేసి మాకు సబ్మిట్ చేయగలరు.
విజేతలు
గ్రమటికెల్ మిస్టేక్స్,ఎర్రర్స్ లేకుండా,మరియు, ప్రశ్నల యొక్క అర్థం మారకుండా, కరెక్ట్ గా అనువాదం చేసిన వారిని, అదేవిధంగా, ఎక్కువ ప్రశ్నలు లేదా, ఎక్కువ పుస్తకాలు, అనువాదం చేసిన వారిని, విజేతలుగా పరిగణిస్తారు. ఇంగ్లీష్ నుండి, హిందీ నుండి, తమిళ్ నుండి, కన్నడ నుండి, మలయాళం నుండి, వేరు వేరుగా విజేతలను అనౌన్స్ చేసి బహుమతులు పంపుతారు.
నియమ నిబంధనలు
ఇందులో పాల్గొను వారు, మీకు ఇవ్వబడే నియమ నిబంధనలను తప్పక,అనుసరించాలి
- గూగుల్ ట్రాన్ లెటర్ లేదా ఇతర సాఫ్ట్వేర్ లు వాడకూడదు.
- అనువాదం చేయుటకు బైబిల్ రెఫరెన్సులు చూడవచ్చు మరియు ఇతరుల సహాయం తీసుకోవచ్చు
- గ్రమటికెల్ మిస్టేక్స్ ఉండకూడదు.
- అనువాదం చేయునపుడు అర్థం మారకూడదు.
- ప్రశ్నలను క్రమంలో అనువదించాలి. (1st question, 2nd question... etc.)
- ప్రశ్నలతో పాటు ఆప్షన్లను మరియు రెఫరెన్సులను అనుకాదించాలి.
- క్రింది వీడియో చూడగలరు...
- రెఫరెన్సుల కొరకు మీరు అనువాదం చేయాలనుకుంటున్న క్విజ్ నందు పాల్గొని view score బటన్ పై క్లిక్ చేయగలరు
ముఖ్యమైన వివరాలు
అనువాదం చేసిన ప్రశ్నలను సబ్మిట్ చేయడానికి👇🏻
అప్లికేషన్ లింక్: Click Here
పైన ఇవ్వబడిన వివరాలు ఇంకా అర్థం కానట్లైతే క్రింది లింక్స్ ద్వారా అర్థం చేసుకోగలరు.
ఎలా పాల్గొనాలి (వీడియో): Click Here
ఏదైనా టెక్నికల్ ఎర్రర్స్ వస్తే..? (వీడియో): Click Here
- - - దేవుడు మిమ్మును దీవించును గాక - - -