Bible Quiz - Gospel Of Matthews
జనవరి 11, 2022
బైబిల్ క్విజ్ - మత్తయి సువార్త
దేవుడు పాత నిబంధనలో తన ప్రజలకు వాగ్దానం చేసిన రక్షకుడు యేసేనని, ఆయన వాగ్దానాలన్నీ యేసులో నెరవేరాయని మత్తయి సువార్త చెప్తోంది. ఈ శుభవార్త కేవలం యూదులకు మాత్రమే కాదని, ఇది యావత్ ప్రపంచానికనీ కూడ ఈ సువార్త చెట్తోంది.
యేసు జననంతో ప్రారంభమైన ఈ సువార్తలో, ఆయన బాప్తిస్మం ఆయన కెదురైన శోధనలు ఆయన బోధలు ఆయన అద్భుతకార్యాలు ఆయన స్వస్థతలు ఒక చక్కని అమరికలో కనిపిస్తాయి. తర్వాత ఈ సువార్త యేసు ఇహలోక జీవితంలోని చివరి వారం గురించి ఆయన గలిలయనుండి యెరూషలేముకు చేసిన ప్రయాణం గురించి ఆయన సిలువ మరణం గురించి ఆయన పునరుత్థానం గురించి తెలియజేస్తాయి.
బైబిల్ క్విజ్ వివరాలు
బైబిల్ క్విజ్ | మత్తయి సువార్త |
ప్రశ్నల విధానం | బహుళ ఎంపిక |
మొత్తం ప్రశ్నలు | 30 |
మొత్తం మార్కులు | 30 |
సమయం | 20 నిమిషాలు |
మత్తయి సువార్తలో...
- యేసు క్రీస్తు వంశావళి, మరియు ఆయన జననం.
- బాప్తిస్మమిచ్చు యోహాను పరిచర్య.
- యేసు బాప్తిస్మం, మరియు శోధనలు.
- గలిలయలో యేసు బహిరంగ పరిచర్య.
- గలిలయనుండి యెరూషలేముకు.
- యెరూషలేములోను, పరిసరాల్లోనూ చివరి వారం.
- ప్రభువు పునరుత్థానం , ప్రత్యక్షతలు.