Matthew Bible Quiz in telugu


మత్తయి సువార్త



మత్తయి సువార్త - బైబిల్ క్విజ్ 

      మత్తయి సువార్త పై బైబిల్ క్విజ్ నందు పాల్గొనుచున్న మీ అందరికి క్రీస్తు నామమున శుభాభి వందనములు. ప్రభువు చూపిన మహా కృపను బట్టి పత్రికల పై బైబిల్ క్విజ్ ను పూర్తి చేసుకొని సువార్తల (మత్తయి, మార్కు, లూకా, యోహాను) పై బైబిల్ క్విజ్స్ ప్రారంభించుచున్నాము. సువార్తల పై నిర్వహించుచున్న ఈ బైబిల్ క్విజ్స్ మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు, క్రీస్తు రాజ్య సువార్త వ్యాప్తిలో ప్రోత్సాహపరచే సాధనాలుగా ఉంటాయని ఆశించుచున్నాము.

     బైబిల్ లోని 66 పుస్తకములలో అందరికి తెలిసిన ప్రముఖ పుస్తకాలు సువార్తలు. దాదాపు అనేక మందికి సువార్తల పై అవగాహన ఉండి ఉంటుంది. అదే సమయంలో అనేక మంది ఈ సువార్తలలోని కొన్ని సన్నివేశాలను అధ్యయనం చేస్తున్నప్పుడు కన్ఫ్యూషన్ అవుతారు. ఇలాంటి వారికి సువార్తల పై నిర్వహించుచున్న ఈ బైబిల్ పరీక్షలు తప్పక సహాయపడుతాయి.

     బైబిల్ క్విజ్ లలో పాల్గొనుటకు ప్రార్ధన పూర్వకముగా సిద్ధపడండి. పాల్గొనిన మీరు అనేక మందికి ఈ క్విజ్ గూర్చి తెలియజేసి దేవుని పనిలో జతవారు కాగలరు. ఈ క్విజ్స్ పై మీకున్న సందేహాలను లేదా మీ అనుభవాన్ని, అనుభూతిని, సాక్ష్యాలను మాతో పంచుకోగలరు. తద్వారా మిమ్మును బట్టి దేవున్ని స్తుతించుటకుమాకు అవకాశాన్ని ఇచ్చిన వారు అవుతారు. మీ అందరికి మరో సారి లివింగ్ మన్నా బైబిల్ లెర్నింగ్స్ బృందం తరఫున వందనములు తెలియజేయుచున్నాము.


     బైబిల్ క్విజ్ వివరాలు
బైబిల్ క్విజ్
మత్తయి సువార్త
ప్రశ్నల విధానం బహుళ ఎంపిక
మొత్తం ప్రశ్నలు 30
మొత్తం మార్కులు 30
సమయం 20 నిమిషాలు


    ఈ ఆన్లైన్ బైబిల్ క్విజ్స్ పై మీరు ఇచ్చుచున్న ఫీడ్బ్యాక్ ను బట్టి మేము ఎంతగానో సంతోషించి ప్రభువును స్తుతించుచున్నాము. క్విజ్స్ పై మీరు చూపుతున్న ఆశక్తి, మక్కువను బట్టి ఆనందించుచున్నాము. ఇంకా ఈ క్విజ్స్ అనేక తెలుగు క్రైస్తవులందరికి తెలియపరచబడాలని, తెలుగు క్రైస్తవ సమూహానికి ఇవి ఉపయోగపడాలని మా ఆశ.