Bible Quiz On Bible Themes
జులై 11, 2021
ప్రత్యేక బైబిల్ క్విజ్ - బైబిల్ లోని అంశాలు
బైబిల్ క్విజ్-వివరములు
బైబిల్ క్విజ్ | బైబిల్ లోని అంశాల |
ప్రశ్నల విధానం | బహుళ ఎంపిక |
మొత్తం ప్రశ్నలు | 10 |
మొత్తం మార్కులు | 10 |
సమయం | 5 నిమిషాలు |
ప్రత్యేక బైబిల్ క్విజ్
ప్రియమైన లివింగ్ మన్నా బైబిల్ లెర్నింగ్స్ శ్రోతలకు క్రీస్తు నామమున హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాము. ఈ ప్రత్యేక బైబిల్ క్విజ్ నందు పాల్గొంటున్న మీకు మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ ప్రత్యేక బైబిల్ క్విజ్స్ ద్వారా మీరు బైబిల్ లోని ఎన్నో విషయాలు వివిధ రీతులుగా తెలుసుకుంటున్నారని ఆశిస్తున్నాము. బైబిల్ లోని అంశాలను ఆధారం చేసుకుని వాటి ద్వారా ఈ ప్రత్యేక బైబిల్ క్విజ్ ను రూపొందించడం జరిగినది. గ్రంథాల వారీగా బైబిల్ క్విజ్స్ తో పాటు ఈ ప్రత్యేక బైబిల్ క్విజ్స్ అనగా అంశాల వారీగా నిర్వహిస్తున్న బైబిల్ క్విజ్స్ ద్వారా కూడా మనం బైబిల్ ను చదివి దానిని ధ్యానించగలం. బైబిల్ ను అంశాల వారీగా అధ్యయనం చేయుటకు ఈ ప్రత్యేక బైబిల్ క్విజ్స్ మీకు ఎంతగానో తోడ్పడుతాయని లివింగ్ మన్నా బైబిల్ లెర్నింగ్స్ టీం విశ్వసిస్తుంది. మీకు తెలిసిన వారితో ఈ క్విజ్ నందు పాల్గొనేలా చేయగలరు. తద్వారా అనేక మందిని బైబిల్ చదువుటకు, ధ్యానించుటకు ప్రోత్సాహించిన వారౌతారు.
అంశాలు-బైబిల్ పుస్తకాలు
"అంశాలు-బైబిల్ పుస్తకాలు" అనే ఈ ప్రత్యేక బైబిల్ క్విజ్ బైబిల్ లోని అంశాలను, వాటి పుస్తకాలను అవగాహన చేసుకొనే విధముగా రూపొందించడం జరిగింది. ఈ బైబిల్ క్విజ్ ద్వారా ఏ ఏ అంశాలు ఏ పుస్తకంలో పొందుపరచబడినవో అనే అవగాహన కలుగుతుందని తెలియజేయుచున్నాము. బైబిల్ క్విజ్స్ పై మీరు చూపుతున్న మక్కువను, ఆశక్తి, ఆశను బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. ఈ ప్రత్యేక బైబిల్ క్విజ్ నందు కూడా పాల్గొని మీకు తెలిసిన వారికి తెలియజేయగలరని మనవి చేయుచున్నాము. ఈ బైబిల్ క్విజ్స్ గూర్చి మీ ప్రార్ధనలలో జ్ఞాపకం చేసుకొండి.
దేవుని పరిచర్యలో మీరు....!
ప్రభువు నందు ప్రియమైన సహోదరులారా..! మీరు కూడా దేవుని పరిచర్యలో పాలిభాగస్థులు కాగలరు. ఈ లివింగ్ మన్నా బైబిల్ లెర్నింగ్స్ పరిచర్య ద్వారా నిర్వహించబడుచున్న కార్యక్రమాలను మీ సన్నిహితులకు తెలియజేయడం ద్వారా అనేకులకు బైబిల్ చదువుటకు ప్రోత్సాహించిన వారై దేవుని పని భాగస్థులు కాగలరు. అంతమాత్రమే కాదు ఈ బైబిల్ క్విజ్స్ ద్వారా మీరు ఏ విధముగా మేలు పొందారో; మీ యొక్క సాక్ష్యాలను మరియు మీ యొక్క సందేహాలను అభిప్రాయాల రూపంలో మాకు తెలియజేయగలరు.