Ephesians Bible Quiz in telugu


ఎఫెసి పత్రిక

 



ఎఫెస్సి పత్రిక బైబిల్ క్విజ్ నందు పాల్గొనబోవుచున్న మీ అందరికి యేసుక్రీస్తు నామములో శుభాలు కలుగును గాక!


Submit బటన్ పై క్లిక్ చేయండి👆🏻

         ప్రియమైన లివింగ్ మన్నా బైబిల్ లెర్నింగ్స్ శ్రోతలారా...! మీ అందరికి ప్రభువును విమోచకుడైన యేసయ్య నామములో శుభాలు తెలియజేస్తున్నాము. ఈ బైబిల్ క్విజ్స్ మీ ఆత్మీయ జీవితమునకు, మీ ఆధ్యాత్మిక అభివృద్ధికి తోడ్పడుతాయని నమ్ముచున్నాము. దేవుడిచ్చిన తలంపును బట్టి, దేవుడిచ్చిన భారమును బట్టి ఈ బైబిల్ క్విజ్స్ నిర్వహించడం జరుగుచున్నది.

        బైబిల్ క్విజ్స్ మీలో అనేక మందికి ఆశీర్వదకరముగా ఉన్నదని మీరిచ్చిన ఫీడ్బ్యాక్ ద్వారా తెలుసుకొని దేవునిని స్తుత్తించుచున్నాము. దేవుడు ఎంతైన నమ్మదగిన గొప్ప దేవుడై ఉన్నాడు. ఆయన తలపులు మన తలంపులు లాంటివి కావు. దేవుడు మనం అనుకున్న వాటికన్న, ఊహించిన వాటికన్న అత్యధికంగా చేసే దేవుడై యున్నాడు. ఈ బైబిల్ క్విజ్ కొరకు ప్రశ్నలను రూపొందించు సమయములో కూడా దేవుడు ఇస్తున్న ప్రేరేపణలను బట్టి, ఆయన చేయుచున్న ఆశ్చర్యకార్యములను బట్టి మనం ఆయనను స్తుత్తించవలసిన వారమైయున్నాము. మీరందరు బైబిల్ క్విజ్స్ పట్ల చూపించుచున్న ఆశక్తిని బట్టి మేము దేవునిని స్తుత్తించుచున్నాము. మీరు దేవునికిస్తున్న ఈ సమయానికై దేవుడు మీకు రెట్టింపు ఆశీర్వదాం దయచేస్తాడు. ఇంకా అనేక మంది వద్దకు ఈ బైబిల్ క్విజ్స్ పరిచర్య చేరుకోనులాగున ప్రార్ధించండి మరియు ఇతరులకు తెలియజేయండి.

         ఈ మన్నా బైబిల్ క్విజ్స్ ద్వారా బైబిల్ లోని వాక్యాలు గుర్తు చేసుకోగలరని, ఆ వాక్యాల ద్వారా ఆదరించబడుతారని, లివింగ్ మన్నా బైబిల్ లెర్నింగ్స్ టీమ్ విశ్వసించుచున్నది. ఈ క్విజ్స్ గూర్చి మీ అనుదిన ప్రార్ధనలో జ్ఞాపకం చేసుకోగలరు. 

      ఈ క్విజ్స్ ద్వారా ఆత్మీయముగా మేలు పొందుతున్న మీరు మీ అనుభవాలను, ఈ బైబిల్ క్విజ్స్ దేవుడు మీతో మాట్లాడిన విధానాన్ని మాతో పంచుకోగలరు. కామెంట్ సెక్షన్ నందు తెలియపరచగలరు లేదా మాకు ఫోన్ చేసి తెలియజేయగలరు. తద్వారా మేము మరియు మా టీమ్ కలసి దేవునిని స్తుత్తించుటకు, దేవుని యందు అతిశయించుటకి అవకాశాన్ని ఇచ్చిన వారౌతారు.