Historical Evidence of Noah's ark
అద్భుతంగా కాపాడిన ప్రభువు
దేవుడు నోవహును ఓడ కట్టమన్నప్పుడు ఈ నాటి కొలతల ప్రకారము 450 అడుగుల పొడవు, 75 అడుగుల వెడల్పు, 45 అడుగుల ఎత్తు కలిగిన మూడంతస్థులుగా ఓడను కట్టి, ఒక ద్వారము, ఒక కిటికీ పెట్టమన్నాడు. (ఆదికాండము 6:13-17) ఆ దినాల్లో ఇంత పెద్ద ఓడ కట్టడం ఎంత భారముతో కూడిన పనియో ఆలోచించండి! ఆ ఓడలోనికి ప్రతి జంతువును, ప్రతి పక్షిని, నేలను ప్రాకు వాటిని వాటి వాటి జాతుల ప్రకారము రెండేసిగా పంపమనెను. (ఆదికాండము 6:20) ఇంచుమించు ఏడువేల జాతుల వర్గాలు గల పక్షి, జంతు జాలములు ఉన్నవని విజ్ఞాన వేత్తలు కనుగొన్నారు. ఇన్నిటిని ఓడలోనికి పంపుట ఎంత కష్టతరమో ఆలోచించండి!
- వీటన్నిటిని ఆ ఓడలో ఉంచాలంటే ఈనాటి లెక్కల ప్రకారము 600 పెద్ద లారీలు కావాలని లేక 4 మైళ్ళ పొడవు కలిగిన పెద్ద రైలుబండి అవసరమని లెక్కలు కట్టారు.
- 40 రోజుల ప్రచండ వర్షములో ఈ ఓడ తేలగా, ఒక సంవత్సరం 10 దినములు నోవహును, అతనితో ఉన్నవారును ఆ ఓడలో ఉండవలసి వచ్చినది! 5 నెలలు ఓడ నీళ్ళలో పయనిస్తూ ఉండగా, ఇంచుమించు 7 నెలలు నీళ్ళపై నిలిచెను. (ఆదికాండము 8:4).
- చివరికి ప్రపంచములో అతి ఎత్తైన శిఖరముగా ఎంచబడుచున్న 17,000 అడుగుల ఎత్తు ఉన్న అరారాతు అను పర్వతము పైన నిలిచినది.
- టర్కీ ఇరాన్, రష్యా సరిహద్దుల మధ్య ఉన్న ఈ పర్వతముపై ఈ ఓడ ఇప్పటికినీ కూరుకొనిపోయి ఉందని 1775 లో ట్రాంకోస్టర్ అనే పరిశోధకుడు.
- పరిశుద్ధ గ్రంథములో ఉన్నవన్నీ సత్యములే! బైబిలు పాతది కాదు గాని, జీవగ్రంథము వంటిది! ఎప్పటికప్పుడు క్రొత్త సమాచారాన్ని మనకు కనుగొన్నాడు! అందించునది!
ముగింపు:
ఈ నోవహు ఓడను ఒక్క సారి మన రక్షణ జీవితానికి అన్వయించుకొన్నట్లైతే... దేవుడు మనకిచ్చిన ఆ అమూల్యమైన రక్షణ విలువ వెలకట్టలేనిది. దేవుడు మనలను పాపమనే గొప్ప జలప్రళయం నుండి రక్షణ అనే ఓడలో మనలను కాపాడిన విధానం ఎంత గొప్పదో... దేవునికి మనం ఎంతైన ఋణస్థులమై యున్నాము. ఆయన ఇచ్చిన రక్షణను బట్టి మనం దిన దినము ఆయనకు కృతజ్ఞత స్తుతులు చెల్లింపవలసిన వారమై యున్నాము.

