God's Creation - Human Body

మానవుని శరీరములోని గొప్ప విషయములు - దేవుని గొప్ప సృష్టి





గుండె: 

6 అంగుళాల పొడవు, 4 అంగుళాల వెడల్పు, 12 ఔన్సుల బరువు ఉంటుంది. ఒక దినమునకు ఇంచుమించు లక్ష పర్యాయములు కొట్టుకొనును. పదివేల లక్షల లీటర్ల రక్తాన్ని 60,000 మైళ్ల పొడవు ఉన్న రక్తనాళములలోనికి పంపుతుంది.

ఊపిరితిత్తి: 

ఒక ఊపిరితిత్తిలో ఇరవై ఐదు వేల లక్షల గాలి బుడగలు కలవు.

చర్మము: 

చర్మము ద్వారా నీరు, తేమ లోపలి నుండి బయటకు వస్తుంది గాని లోపలికి పోలేదు. మన శరీరములోని 1/3వ వంతు రక్త ప్రసరణ చర్మము గుండా జరుగుతుంది.

మూత్రపిండం: 

ఒక మూత్రపిండంలో పది లక్షలకు పైగా ఫిల్టర్లుంటాయి. వాటిని సాగదీసి ఒకదాని వెనుక ఒకటి ఉంచితే సుమారు 85 మైళ్ళ పొడవైన త్రాడు తయారవుతుంది.

ఎముకలు: 

ఇటుక, రాళ్ళు కంటె 30 రెట్ల బరువును మోస్తాయి.

మెదడు: 

సెరిబ్రమ్ లోనికి వెళ్ళి బయటకు వచ్చే నరాల సంఖ్య 20 కోట్లు - ఎన్ని కణాలున్నాయంటే 1,00,00,00,000. ఇంత క్లిష్టమైనది మెదడు వ్యవస్థ.

ఉదరము: 

ఉదరము మనకు ఏ హాని కలుగకుండా హెడ్రో క్లోరిక్ ఆమ్లమును ఉత్పత్తి చేస్తుంది. మన శరీర గొప్ప మర్మాలలో యిది ఒకటి. 70 సంవత్సరముల జీవిత కాలములో ఈ ఉదరం 67,500 లీటర్ల జీర్ణ రసాన్ని ఉత్పత్తి చేస్తుంది. మరియు 40 టన్నుల ఆహారాన్ని జీర్ణించుకొంటుంది.

స్వరపేటిక: 

కొంతమంది గాయకులు ఒక సెకనుకు 1400 విధాలుగా తమ స్వరాలను హెచ్చు తగ్గులుగా వినిపించగలరు.

నేత్రములు: 

రెటీనా అతి పలుచని ఉల్లిపొర కాగితము కన్న పలుచని పొర. ఇది 137 మిలియన్ నరముల కొనలను కలిగి యుండి దృశ్యములను మెదడుకు తీసికొనిపోతుంది. మానవుని కన్ను 17,000 రంగులను గుర్తించగలదు.

పాదములు: 

ఒక పాదము 26 ఎముకలతో 33 జాయింట్లను కలిగి ఒక బలమైన బంధం ద్వారా కట్టబడుతుంది.

నరాలు: 

శరీరంలోని కొన్ని నరాలు సెకనుకు 300 అడుగుల వేగంతో సందేశాలను ప్రసారం చేస్తే, మరికొన్ని సెకనుకు 1/2 అడుగుల చొప్పున మందగతితో ప్రసారం చేస్తాయి.


      ఇంత ఆశ్చర్యకరమైన మన దేహము దేవుని వలన మనకు అనుగ్రహించబడి మనలో నున్న పరిశుద్ధాత్మకు ఆలయముగా ఉన్నదని మనం ఎరుగని వారమై ఉన్నామా? మనము మన  సొత్తు కాదు. మనము విలువ పెట్టి కొనబడినవారము గనుక మన దేహముతో దేవుని మహిమపరచవలెను అని (I కొరింథీ 6: 19,20) అని బైబిలు చెప్పుచున్నది.

     మనలో ప్రతివాడు తన్ను గురించి దేవుడికి లెక్క అప్పగింపవలెను. (రోమా 14:12 చదవండి) "ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలయునని బైబిల్ నందు మనము చదువగలము” (II కొరింథీ 5:10). కావున ప్రభువు వలన మనకనుగ్రహింపబడిన ఈ అద్భుతమైన శరీరము పాపము కొరకు కాక, దేవుని కొరకు వాడుదాం....!