WHO SAID THAT - Online Bible Quiz
SPECIAL BIBLE QUIZZES - Online
ప్రత్యేక బైబిల్ క్విజ్
బైబిల్ పలుక బడిన మాటల మీద అవగాహన కలుగుటకు ఈ యొక్క ఎవరన్నారు అనే ప్రత్యేకమైన బైబిల్ క్విజ్ రూపొందించడం జరిగినది. ఈ క్విజ్ ను రూపొందించుటకు దేవుడిచ్చిన ఈ తలంపును బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలుపవలసినవారమై యున్నాము.
మనం పరిశుద్ధ గ్రంధమందు తెలుసుకోవాల్సిన సత్యాలు అనేకమైనవి. ఆత్మీయ యాత్రకు అవసరమైన ప్రతి అంశం బైబిల్ నందు ఉంటుంది. మనకున్న సందేహాలకు, ప్రశ్నలకు లేక అనుమానాలు, అపోహలకు సమాధానాలు బైబిల్ నందు తప్పక లభిస్తాయి. కావున పరిశుద్ధ గ్రంథమును పఠించడం ముఖ్యమైనది. బైబిల్ క్విజ్స్ నందు పాల్గొంటున్న మీరందరు పరిశుద్ధ గ్రంథమును పఠించి ప్రార్ధన పూర్వకముగా క్విజ్ కొరకు సిద్ధపడుతున్నారని నమ్ముచున్నాము.
బైబిల్ క్విజ్ వివరాలు
| బైబిల్ క్విజ్ | ఎవరన్నారు? |
| ప్రశ్నల విధానం | బహుళ ఎంపిక |
| మొత్తం ప్రశ్నలు | 15 |
| మొత్తం మార్కులు | 15 |
| సమయం | 20 నిమిషాలు |
బైబిల్ క్విజ్ నందు పాల్గొనుచున్న మీ అందరికి లివింగ్ మన్నా బైబిల్ లెర్నింగ్స్ పేరిట వందనములు. ఈ బైబిల్ క్విజ్స్ మీ ఆత్మీయమైన జీవితానికి, విశ్వాస జీవితానికి ఎంతగానో ఉపయోగపడతాయని నమ్ముచున్నాము. ఇటువంటి బైబిల్ క్విజ్స్ గూర్చి ఇతరులతో పంచుకొని దేవుని యొక్క పనిలో పాలిభాగస్థులవ్వగలరు అని కోరుచున్నాము.
