Manna Children Bible Quiz - Season 1
Children Bible Quiz-Season 1
పిల్లల ప్రత్యేక - బైబిల్ క్విజ్
పిల్లల బైబిల్ క్విజ్ నందు పాల్గొనుచున్న అందరికి కృతజ్ఞతలు. దేవుడు పిల్లలను ప్రేమించిన విధానం మనకందరికి తెలిసినదే. పై రూపాన్ని చూడక మనసు చూచే దేవుడైయున్నాడు మన దేవుడు. అది సేవలో అయిన యుద్ధములో అయిన రాజును చేయడంలో అయిన దేవుడు వయసును చూడలేదు, అందమును చూడలేదు, జ్ఞానమును చూడలేదు, ధనమును చూడలేదు, వృత్తిని చూడలేదు కానీ వారికున్న మనసును చూసాడు. కావును మన మనస్సు దేవునికి ఇష్టకరముగా ఉన్నప్పుడు ఆయన మనలను ఎన్నుకుంటారు, ఏర్పరచుకుంటారు.
పిల్లలు ఏ పాపము ఎరుగని వారై ద్వేషాన్ని పెంచుకోకుండా ఉండే స్వభావం వారిలో ప్రాయముఖ్యముగా చూడగలం. దేవుడు వారిని ప్రేమించి తన రాజ్య వారసులుగా చేస్తన్నన్నాడు. మనం పరలోక రాజ్యం చేరాలన్నా దేవుడు మొదటిగా మనలో చూచేది మన మనసు. పిల్లలు దేవునికి తమ చిన్నతనంలో సమయమిస్తూ దేవునిలో గడుపుచున్నప్పుడు వారు పెద్దవారయ్యాక కూడా దేవుని పై ఆశక్తి, ప్రేమ వారిలో ఉంటుంది. దేవున్ని ప్రేమించి దేవునికి సమయం ఇవ్వగలరు.
ప్రత్యేకంగా పిల్లల కొరకు రూపొందించిన ఈ బైబిల్ క్విజ్ నందు చిత్రాలతో కూడిన ప్రశ్నలను అడగడం జరిగినది. పిల్లలు పరిశుద్ధ గ్రంథం పట్ల ఆశక్తి చూపాలనే ఉద్దేశ్యముతో ఈ బైబిల్ క్విజ్ ను అలంకరించడం జరిగింది. ఈ బైబిల్ పరీక్ష వలన చిన్న పిల్లలలో బైబిల్ మీద ప్రార్థమిక అవగాహన కలుగుతుంది.
బైబిల్ క్విజ్ వివరాలు
| బైబిల్ క్విజ్ | పిల్లల బైబిల్ క్విజ్ |
| ప్రశ్నల విధానం | బహుళ ఎంపిక |
| మొత్తం ప్రశ్నలు | 15 |
| మొత్తం మార్కులు | 15 |
| సమయం | మీ అనుకూలతను బట్టి |
చిన్న పిల్లల కొరకు ప్రత్యేకముగా నిర్వహించబడిన ఈ చిత్రాల బైబిల్ పరీక్షలో మీకు తెలిసిన ఇతర పిల్లల చేత కూడా పార్టీసిపేట్ చేయించగలరు. దీని ద్వారా వారికి బైబిల్ లో ఉన్న విషయాలను తెలుసుకోవాలని ఆశ, ఆశక్తి కలుగుతుంది.
