RUTH Bible Quiz


రూతు-బైబిల్ క్విజ్

 

రూతు - బైబిల్ క్విజ్ 

     రూతు గ్రంథము పై బైబిల్ క్విజ్ నందు పాల్గొంటున్న మీకు మన్నా బైబిల్ క్విజ్స్ వారి ప్రత్యేకమైన శుభములు తెలియజేయుచున్నాము...!


రూతు గ్రంథం క్లుప్త వివరణ:

   పరిశుద్ధ గ్రంధమందు మనకు కనిపించే రెండు స్త్రీల పుస్తకాలలో రూతు ఒకటి. ఆ రెండు స్త్రీల పేరుతో ఉన్న పుస్తకాలలో రూతు గ్రంధం చిన్నదైనప్పటికి; ఆ గ్రంధంలో ఉన్న సందేశం చాలా విశేషమైనది. రూతు అన్యురాలైనప్పటికి దేవునిని తెలుసుకున్న రూతు ఎన్ని శ్రమలు, కష్టాలు వచ్చినప్పటికీ దేవునిని విసర్జింపలేదు. ఈ గొప్ప లక్షణం మనకందరికీ ఆదర్శం.


ప్రియమైన క్విజ్ సభ్యులారా...!

    మీ అందరికి రక్షకుడైన యేసు నామంలో వందనాలు తెలియజేయుచున్నాము. బైబిల్ క్విజ్స్ నందు మీరు చూపిస్తున్న ఆశక్తి, ఆశ ను బట్టి మిమ్ములను అభినందించుచున్నాము. ఈ యొక్క బైబిల్ క్విజ్స్ ద్వారా మీరు దేవునికిస్తున్న సమయాన్ని బట్టి దేవునిని ఘనపరచుచున్నాము. మీ అనుదిన ప్రార్ధనలలో ఈ ఆన్లైన్ బైబిల్ క్విజ్స్ గూర్చి తప్పక ప్రార్ధించాలని మనవి చేయుచున్నాము.


బైబిల్ పరీక్ష యొక్క వివరములు

బైబిల్ క్విజ్ రూతు
ప్రశ్నల విధానం బహుళ ఎంపిక
మొత్తం ప్రశ్నలు 25
మొత్తం మార్కులు 25
సమయం 20 నిమిషాలు


  

బైబిల్ క్విజ్ పరిచయ ప్రక్రియ:

    బైబిల్ క్విజ్స్ గూర్చి మీకు పరిచయం ఉన్న వారికి తెలియజేసి వారిని కూడా దేవునిలోకి నడిపించగలరని కోరుచున్నాము. మీరు చేసే ఈ యొక్క దేవుని పని పరిచయం దేవుని పరిచర్యగా పరిగణించబడుతుంది. కావున ఈ మన్నా బైబిల్ క్విజ్స్ గూర్చి మీ తోటివారితో పంచుకొని పరిచర్యలో పాలిభాగస్థులు కాగలరు ప్రియులారా....