1st JOHN Bible Quiz
జనవరి 11, 2022
మొదటి యోహాను పత్రిక నందు పాల్గొనుచున్న మీకు మా శుభాలు తెలియపరచుచున్నాము.
1వ యోహాను పత్రిక - బైబిల్ క్విజ్
మొదటి యోహాను పత్రిక సారాంశం:
మొదటి యోహాను పత్రిక అంటానే ప్రేమ అనే పదం మనకు జ్ఞాపకం వస్తుంది. ప్రేమ అనే అంశాన్ని గూర్చిన అనేక విషయాలు ఈ పత్రికలో పొందుపరచబడడం విశేషం. ఈ మొదటి యోహాను పత్రిక చిన్నపిల్లలను, యవ్వనస్థులను, పెద్దలను అందరిని హెచ్చరించే పత్రిక. అందరిని ఆదరించే పత్రిక, అందరికి అర్ధమయ్యే రీతిలో చెప్పబడిన పత్రిక. మరి దీనిని చదివిన మీరు ఆ విధముగా మేలు పొందారని నమ్ముచున్నాము.
బైబిల్ పరీక్ష యొక్క ఆశయం:
మొదటి యోహాను పత్రిక ద్వారా దేవుడు మీకు అవసరమైన వాక్కును మాట్లాడాడని లివింగ్ మన్నా బైబిల్ లెర్నింగ్స్ టీమ్ విశ్వసించుచున్నది. మొదటి యోహాను పత్రికను చదివిన మీరు ఈ క్విజ్ నందు పాల్గొనడం ద్వారా మీరు చదివిన దానిని ధ్యానిస్తారని, గుర్తించుకుంటారని ఆశించుచున్నాము. ఈ క్విజ్ ప్రశ్నలను మీ స్నేహితులతో పంచుకోండి.
మన్నా బైబిల్ క్విజ్స్ గూర్చి అనేకులకు పరిచయం చేయండి:
లివింగ్ మన్నా బైబిల్ లెర్నింగ్స్ టీమ్ వారు నిర్వహించుచున్న ఈ బైబిల్ పరీక్షల గూర్చి మీ మిత్రులకు, సన్నిహితులకు తెలియజేయండి. మీరు ఈ క్విజ్స్ గూర్చి అనేక మందికి తెలియజేయడం ద్వారా దేవుని పరిచర్యలో పాలిభాగస్థులు కాగలరు. దేవుని పనిలో ఈ విధముగా సహకరించి అనేక మందిని బైబిల్ తట్టు ఆకర్షితులుగా చేయగలరని మనవి చేయుచున్నాము.
బైబిల్ క్విజ్ వివరాలు
| బైబిల్ క్విజ్ | 1 యోహాను పత్రిక |
| ప్రశ్నల విధానం | బహుళ ఎంపిక |
| మొత్తం ప్రశ్నలు | 35 |
| మొత్తం మార్కులు | 35 |
| సమయం | 20 నిమిషాలు |
మీ యొక్క అనుభవాన్ని పంచుకోనండి:
ఈ బైబిల్ క్విజ్స్ నందు పాల్గొనుచున్న మీరు; ఈ క్విజ్స్ మీకు ఏ విధముగా ఉపయోగపడుచున్నాయో ఆ యొక్క మీ అనుభవాన్ని మాతో పంచుకోగలరు. దాని ద్వారా దేవున్ని స్తుత్తించుటకు లివింగ్ మన్నా బైబిల్ లెర్నింగ్స్ టీం వారికి అవకాశమును ఇచ్చిన వారవుతారు.
రెండవ మరియు మూడవ యోహాను పత్రికల బైబిల్ క్విజ్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
