Book Of 2nd PETER Bible Quiz
జనవరి 11, 2022
1
పేతురు వ్రాసిన రెండవ పత్రిక బైబిల్ క్విజ్ నందు పాల్గొనుచున్న మీకు మా శుభాలు తెలియపరస్తున్నాము.
రెండవ పేతురు పత్రిక - బైబిల్ క్విజ్
మనం పత్రికలు చదవడం చాలావరకు సులభం. ఎందుకంటే అవి చిన్న చిన్న పుస్తకాలని మనం భావిస్తాం. కానీ పత్రికలు చాలా వరకు చిన్న పుస్తకాలైన వాటిలో ఉన్న సారాంశం మాత్రం చాలా అమూల్యమైనది. వాటిలో ఉన్న సత్యాలు మన నిజ జీవితానికి మేలు కలిగించే ముత్యాలు. ఈ పత్రికలలోని సారాంశాలను మన జీవితానికి అన్వయించుకోగలిగితే అవి మన విశ్వాసాన్ని రెట్టింపు చేస్తాయి.
బైబిల్ పరీక్ష యొక్క ముఖ్య ఉద్దేశ్యం:
దేవుడు మాకిచ్చిన భారాన్ని బట్టి, ఆయన ఇచ్చిన తలంపును బట్టి ఈ బైబిల్ క్విజ్స్ ను నిర్వహించడం జరుగుచున్నది. ఈ క్విజ్స్ నిర్వహించడంలో దేవుడు చేసిన అనేక కార్యాలను బట్టి దేవున్ని స్తుత్తించుచున్నాము. అనేక మందిని బైబిల్ పట్ల ఆకర్షితులను చేయగలిగే సాధనం బైబిల్ క్విజ్. పరిశుద్ధ గ్రంధమందు మనం పఠించిన వాక్యాలను నెమరు వేయుటకు, ధ్యానించిన అంశాలను గుర్తించుకోవడానికి ఈ బైబిల్ క్విజ్స్ ఎంతో సహకరిస్తాయి అని చెప్పవచ్చు. బైబిల్ క్విజ్స్ లోని ప్రశ్నల ద్వారా హెచ్చరింపడిన వారి సాక్ష్యాలు విని దేవునిని స్తుతియించుచున్నాము.
దేవుని పనిలో పాలిభాగస్థులు కాగలరు:
ఈ మన్నా బైబిల్ క్విజ్స్ గూర్చి అనేక మందికి పరిచయం చేయడం ద్వారా ఈ పరిచర్యకు సహకరించిన వారవుతారు. పరిశుద్ధ గ్రంథము పట్ల అనేకులకు త్రిప్పుటలో జతపని వారు కాగలరు. కాబట్టి ఈ బైబిల్ క్విజ్ గూర్చి మీకు తెలిసిన వారందరికి తెలియజేసి దేవుని సేవలో సహకారులు కాగలరు.
బైబిల్ పరీక్ష వివరాలు
| బైబిల్ క్విజ్ | 2 పేతురు పత్రిక |
| ప్రశ్నల విధానం | బహుళ ఎంపిక |
| మొత్తం ప్రశ్నలు | 30 |
| మొత్తం మార్కులు | 30 |
| సమయం | 20 నిమిషములు |
మీ ఫీడ్బ్యాక్ తెలియజేయండి:
ఈ బైబిల్ పరీక్షల యందు మానక పాల్గొనుచున్న మీరు ఏ విధంగా మేలు పొందారో, ఏ విధముగా హెచ్చరింపబడ్డారో మీ యొక్క అనుభవాన్ని మాతో పంచుకోవాలని మనవి చేయుచున్నాము. ఇలా మీ అనుభవాన్ని పంచుకోవడం ద్వారా దేవునిని మేము స్తుతీయించుటకు అవకాశమును పొందిన వారవుతాము.
మొదటి పేతురు పత్రిక బైబిల్ క్విజ్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
